Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఢిల్లీ గృహిణి దశ తిరిగింది.. అబుదాబి లాటరీలో రూ.65 కోట్ల జాక్‌పాట్!

Delhi housewife wins 65 crore jackpot in Abu Dhabi lottery
Advertisement
  • అబుదాబి బిగ్ టికెట్ డ్రాలో ఢిల్లీ మహిళకు జాక్‌పాట్
  • గృహిణి కనికా అరోరాకు రూ.65 కోట్ల భారీ లాటరీ
  • భార్య పేరు మీద భర్త ఆన్‌లైన్‌లో కొన్న టికెట్‌కు అదృష్టం
  • నాలుగేళ్లుగా టికెట్లు కొంటున్న కుటుంబం
  • కొత్త ఇల్లు, కూతురి భవిష్యత్తు కోసం డబ్బు వినియోగిస్తామని వెల్లడి
Advertisement
ఢిల్లీకి చెందిన ఓ సాధారణ గృహిణిని అదృష్టం వరించింది. అబుదాబిలో నిర్వహించిన ‘బిగ్ టికెట్’ లైవ్ డ్రాలో ఆమె ఏకంగా 25 మిలియన్ దిర్హమ్‌ల (భారత కరెన్సీలో సుమారు రూ. 65 కోట్లు) భారీ జాక్‌పాట్‌ను గెలుచుకున్నారు. ఈ మెగా ప్రైజ్ విజేతను ఢిల్లీకి చెందిన 42 ఏళ్ల కనికా అరోరాగా నిర్వాహకులు గుర్తించారు.

వివరాల్లోకి వెళ్తే.. కనికా భర్త గత నాలుగేళ్లుగా క్రమం తప్పకుండా ‘బిగ్ టికెట్’ డ్రాలో టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జూన్ 30న జరిగిన డ్రా కోసం తన భార్య కనికా పేరు మీద ఆన్‌లైన్‌లో 476107 నంబరు గల టికెట్‌ను ఆయన తీసుకున్నారు. అనూహ్యంగా ఈ టికెట్‌కే బంపర్ బహుమతి వరించడంతో ఆ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది.

తాను రూ. 65 కోట్లు గెలిచానన్న వార్తను మొదట నమ్మలేకపోయానని కనికా అరోరా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సొమ్ముతో కొత్త ఇల్లు కొనుగోలు చేయడంతో పాటు, తమ ఐదేళ్ల కుమార్తె ఉన్నత చదువులు, భవిష్యత్తు అవసరాల కోసం కొంత మొత్తాన్ని కేటాయిస్తామని ఆమె తెలిపారు. అలాగే, ఎప్పటి నుంచో తమకున్న డిస్నీల్యాండ్ సందర్శన కలని కూడా ఈ నిధులతో నెరవేర్చుకుంటామని ఆ కుటుంబం సంతోషంగా వెల్లడించింది. యూఏఈలో నిర్వహించే ‘బిగ్ టికెట్’ డ్రాకు విశేష ఆదరణ ఉంది. ప్రతినెలా జరిగే ఈ లక్కీ డ్రాలో వేలాది మంది ప్రవాసులు పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు.
Advertisement
Advertisement
Kanika Arora
Abu Dhabi Big Ticket
Delhi housewife lottery winner
25 million Dirhams jackpot
Big Ticket Live Draw
Indian UAE lottery winner

More Telugu News